4 రోజుల్లో 400 కోట్లు

సూపర్‌స్టార్ రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన 'కూలీ' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా రిలీజ్‌కి ముందే హైప్‌తో పాటు భారీ అడ్వాన్స్‌ బుకింగ్స్ సాధించింది.;

By :  S D R
Update: 2025-08-18 14:34 GMT

సూపర్‌స్టార్ రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన 'కూలీ' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా రిలీజ్‌కి ముందే హైప్‌తో పాటు భారీ అడ్వాన్స్‌ బుకింగ్స్ సాధించింది. ఫలితంగా తొలి రోజే రూ.151 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి, కోలీవుడ్‌లో ఫస్ట్ డే హయ్యెస్ట్ రికార్డు సృష్టించింది.

ఇక నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.404 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. తమిళ సినిమా హిస్టరీలోనే ఇదొక రికార్డ్ అని సన్ పిక్చర్స్ తెలిపింది. 'కూలీ' సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, కలెక్షన్లలో మాత్రం రికార్డులు తిరగరాస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ.370 కోట్లు. ఆంధ్రా–నైజాం ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.90 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది.



Tags:    

Similar News