నందమూరి కుటుంబంలో విషాదం

విశ్వవిఖ్యాత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు పెద్ద కోడలు, నందమూరి జయకృష్ణ గారి సతీమణి శ్రీమతి పద్మజ (73) ఈరోజు తెల్లవారుజామున మృతిచెందారు.;

By :  S D R
Update: 2025-08-19 06:53 GMT

విశ్వవిఖ్యాత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు పెద్ద కోడలు, నందమూరి జయకృష్ణ గారి సతీమణి శ్రీమతి పద్మజ (73) ఈరోజు తెల్లవారుజామున మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

పద్మజ గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి కూడా కావడం విశేషం. ఈ సంఘటనతో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ వార్త తెలిసి విజయవాడ నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఢిల్లీ నుండి మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి మధ్యాహ్నం కుటుంబ సభ్యులను పరామర్శించడానికి బయలుదేరినట్టు సమాచారం.

పద్మజ గారి మృతిపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేస్తూ “బావమరిది నందమూరి జయకృష్ణ సతీమణి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి పద్మజ మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఈ ఘటన మా కుటుంబంలో విషాదం నింపింది. పద్మజ ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.” అని పేర్కొన్నారు.

నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేస్తూ – “మామయ్య నందమూరి జయకృష్ణ గారి సతీమణి, పద్మజ అత్త కన్నుమూశారన్న వార్త నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. మా కుటుంబానికి అన్నివేళలా అండగా నిలిచే పద్మజ అత్త ఆకస్మిక మృతి మా కుటుంబానికి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.” అని తెలిపారు.




Tags:    

Similar News