‘పెద్ది‘ షాట్ ను రీక్రియేట్ చేసిన డీసీ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది‘. ఈ సినిమా నుంచి చరణ్ బర్త్ డే స్పెషల్ గా రిలీజైన ఫస్ట్ షాట్ కు భారీ స్పందన లభించింది.;
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది‘. ఈ సినిమా నుంచి చరణ్ బర్త్ డే స్పెషల్ గా రిలీజైన ఫస్ట్ షాట్ కు భారీ స్పందన లభించింది. ఇప్పుడు అదే వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు క్రియేటివ్‌గా రీక్రియేట్ చేయడం విశేషంగా మారింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఈరోజు ఉప్పల్ వేదికగా జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు, ఢిల్లీ క్యాపిటల్స్ ఒక స్పెషల్ వీడియో విడుదల చేసింది. ఇందులో రామ్‌చరణ్ కొట్టిన స్టైలిష్ షాట్‌ను ఢిల్లీ క్రికెటర్ సమీర్ రిజ్వీ ఈ వీడియోలో అచ్చంగా దింపేశాడు.
'పెద్ది' సినిమా గ్లింప్స్‌కు ఉన్న నేపథ్య సంగీతాన్ని ఉపయోగించి వీడియోను బాగా కట్ చేశారు. దీన్ని డీసీ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా, 'పెద్ది' టీమ్ తో పాటు రామ్‌చరణ్ కూడా ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.