జవాన్ కుటుంబానికి అండగా బాలకృష్ణ
జమ్మూ కాశ్మీర్ యుద్ధరంగంలో.. పాకిస్థాన్ కాల్పుల్లో వీరమరణం పొందిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి, సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మద్దతుగా నిలిచారు.;
జమ్మూ కాశ్మీర్ యుద్ధరంగంలో.. పాకిస్థాన్ కాల్పుల్లో వీరమరణం పొందిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి, సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మద్దతుగా నిలిచారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన తెలుగు వీరునికి నివాళులర్పించిన ఆయన, తన వంతు బాధ్యతగా ఒక నెల వేతనాన్ని జవాన్ కుటుంబానికి ఆర్థికసాయంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు బాలకృష్ణ పర్సనల్ సెక్రటరీలు మే 12న శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కల్లితండా గ్రామానికి వెళ్లి, మురళీ నాయక్ తల్లిదండ్రులను పరామర్శించి, ఆర్థిక సహాయం అందించనున్నారు.
మరోవైపు, మురళీ నాయక్ మృతదేహం గ్రామానికి చేరుకున్న సమయంలో గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. బెంగళూరులో ఏపీ మంత్రి సవిత మొదలైన పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తో పాటు పలువురు నేతలు మురళీ నాయక్ మృతి పట్ల సంతాపం తెలిపారు.