వీరమల్లు నిశ్శబ్దంగా కాదు, సంకల్పంతో వస్తోంది – క్రిష్‌

వైరల్ అవుతున్న క్రిష్ పోస్ట్ – వీరమల్లు వెనకున్న నమ్మకం కనిపిస్తుంది!;

Update: 2025-07-22 08:16 GMT

హరిహర వీరమల్లు ఒక భారీ పీరియాడిక్ ప్రాజెక్ట్‌, తొలుత దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన క్రిష్ జాగర్లమూడి, సినిమా తరచూ ఆలస్యమవుతుండటంతో మధ్యలోనే తప్పుకొని, అనుష్క శెట్టితో కలిసి ‘ఘాటి’ అనే చిత్రానికి మారిపోయారు. దీంతో చిత్ర నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు నిర్మాత ఏఎం రత్నం తన కుమారుడు జ్యోతికృష్ణకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఆయన చివరికి సినిమా పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేశారు.

ఈ నేపథ్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్, క్రిష్‌ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ "క్రిష్ చాలా మంచి కాన్సెప్ట్‌తో వచ్చినప్పుడు, కథలో భావం తెలిసి కథ వినగానే నేను అంగీకరించాను అని క్రిష్ కు అభినందనలు తెలిపారు పవర్ స్టార్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ జూలై 24న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తన భావోద్వేగాలను పంచుకుంటూ ఒక సుదీర్ఘమైన పోస్టు విడుదల చేశారు. ఈ సినిమాలో తొలుత దర్శకుడిగా వ్యవహరించిన క్రిష్, అనేక కారణాలతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నప్పటికీ, ఆయనలోని ప్రేమ, గౌరవం మాత్రం తగ్గలేదని స్పష్టంగా కనిపించింది.

"వీరమల్లు నిశ్శబ్దంగా కాదు… సంకల్పంతో వస్తోంది" అని మొదలైన ఈ భావోద్వేగ స్పందనలో క్రిష్ ఈ సినిమా వెనుక ఉన్న నమ్మకాన్ని , విశ్వాసాన్ని ప్రతిబింబింపజేశారు.

ఈ చిత్రానికి శరీరం, ఆత్మ, ఊపిరి ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారే. ఆయనలో కెమెరా పట్టలేని అగ్ని ఉంది. ఆ అగ్నికి మూలం సంకల్పం. ఆయన లాంటి అసాధారణ శక్తి వల్లే ఈ ప్రయాణం సాధ్యమై ఒక చారిత్రాత్మక చిత్రాన్ని ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రావటం సాధ్యపడింది.

అలాగే నిర్మాత ఏఎం రత్నం గురించి మాట్లాడుతూ, "భారతీయ సినిమా ప్రపంచానికి గొప్ప అనుభవంతో కూడిన గొప్ప నిర్మాతే కాకుండా కథను బట్టి సినిమాని ఎలా చూపించాలి అనే ధోరణిలో అయన మంచి ఆర్కిటెక్ట్‌ రత్నం గారు అని ప్రశంసించారు. ఆయనలో ఉన్న దృఢమైన ధైర్యం, క్లారిటీ, నిర్మాణం పట్ల విశ్వాసం ఈ చిత్రానికి నమ్మకంగా నిలిచాయి. అంటూ తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సినిమా కథ గురించి మాట్లాడుతూ, కృష్ణా నదీతీరంలో దొరికిన కోహినూర్ వజ్రం ఎలా హైదరాబాద్ సుల్తానుల చెంతికి చేరింది, దాని చారిత్రక ప్రయాణం ఎలా సాగింది అనే కాన్సెప్ట్‌ను పవన్ కళ్యాణ్‌కు వినిపించగానే ఆయన ఆసక్తిగా స్పందించారని క్రిష్ చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా ప్రెస్‌మీట్, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో కూడా పవన్ కళ్యాణ్ – క్రిష్ మధ్య గల పరస్పర గౌరవం, స్నేహం, పరిశ్రమలో ఒక పాజిటివ్ సిగ్నల్‌గా నిలిచింది. క్రిష్ చేసిన ఈ ఉదాత్తమైన స్పందన సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తిని కలిగించింది.

Tags:    

Similar News