సంయుక్త బర్త్ డే స్పెషల్స్
పద్ధతైన పాత్రల్లో అందంగా ఒదిగిపోయే సంయుక్తకు.. తెలుగులో సూపర్ హిట్ ట్రాక్ రికార్డ్ ఉంది. 'భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్' ఇలా తెలుగులో చేసిన ప్రతీ సినిమా హిట్టే.;
పద్ధతైన పాత్రల్లో అందంగా ఒదిగిపోయే సంయుక్తకు.. తెలుగులో సూపర్ హిట్ ట్రాక్ రికార్డ్ ఉంది. 'భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్' ఇలా తెలుగులో చేసిన ప్రతీ సినిమా హిట్టే. సంయుక్తకి తెలుగులో ఇదొక రేర్ రికార్డ్ అని చెప్పొచ్చు. అందుకే.. ఈ మలయాళీ అమ్ముడు తెలుగు మేకర్స్ కి లక్కీ ఛార్మ్ గా మారింది. ప్రస్తుతం వరుస సినిమాలు సంయుక్త కిట్టీలో చేరాయి.
సంయుక్త చేస్తున్న చిత్రాలలో బాలకృష్ణ ‘అఖండ 2‘తో పాటు పూరి-సేతుపతి, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి‘, నిఖిల్ ‘స్వయంభూ‘, బెల్లంకొండ శ్రీనివాస్ ‘హైందవ‘ వంటి భారీ చిత్రాలున్నాయి. వీటితో పాటు ‘చింతకాయల రవి‘ ఫేమ్ యోగి దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మిస్తున్న సినిమాలోనూ ప్రధాన పాత్రలో కనిపించబోతుంది. ఈరోజు సంయుక్త బర్త్ డే స్పెషల్ గా ఈ మూవీస్ నుంచి స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేశారు మేకర్స్.