‘అఖండ 2‘ టీజర్.. బాలయ్య తాండవం!
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ఎనర్జీని ఆన్ స్క్రీన్ పై అద్భుతంగా ఆవిష్కరించే దర్శకుడు బోయపాటి శ్రీను. ఇప్పటికే వీరిద్దరి కలయికలో ‘సింహా, లెజెండ్, అఖండ‘ వంటి హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయి.;
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ఎనర్జీని ఆన్ స్క్రీన్ పై అద్భుతంగా ఆవిష్కరించే దర్శకుడు బోయపాటి శ్రీను. ఇప్పటికే వీరిద్దరి కలయికలో ‘సింహా, లెజెండ్, అఖండ‘ వంటి హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయి. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుడుతూ ‘అఖండ 2‘తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ‘అఖండ 2‘ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.
లేటెస్ట్ గా బాలకృష్ణ బర్త్ డే స్పెషల్ గా ‘అఖండ 2‘ టీజర్ రిలీజ్ చేశారు. బాలకృష్ణ అఘోరా గెటప్ లో కనువిందు చేస్తున్న ‘అఖండ 2‘ టీజర్ ఆద్యంతం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ‘నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు.. నువ్వు చూస్తావా? అమాయకుల ప్రాణాలు తీస్తావా‘ అంటూ అఘోరాగా బాలయ్య విలన్లతో శివ తాండవం చేసిన విజువల్స్ టీజర్ కి హైలైట్.
ముఖ్యంగా ‘అఖండ 1‘లో గెటప్ తో పాటు.. ‘అఖండ 2‘లో మరింతగా జుట్టు, గడ్డంతో కనిపిస్తున్న బాలయ్య ఆహార్యం ఆకట్టుకుంటుంది. మొదటి భాగానికి మించి ‘అఖండ 2‘లో బోయపాటి మార్క్ మాస్ విధ్వంశం ఓ రేంజులో ఉండబోతున్నట్టు అర్థమవుతుంది. అలాగే తమన్ బి.జి.ఎమ్. మరోసారి బాక్సులు బద్దలు కొట్టనుంది. మొత్తంగా.. ‘అఖండ 2‘ టీజర్ తో పాటు రిలీజ్ డేట్ పైనా మరోసారి క్లారిటీ ఇచ్చేసింది టీమ్. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ‘అఖండ 2‘ రిలీజ్ కు రెడీ అవుతుంది.