బాలయ్యతో తమిళ దర్శకుడు?
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ తెలుగు ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తున్నట్టు చెన్నై సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 'మార్క్ ఆంటోని, గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు అధిక్.;
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ తెలుగు ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తున్నట్టు చెన్నై సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 'మార్క్ ఆంటోని, గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు అధిక్. ముఖ్యంగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రంలో అజిత్ ను ఎలివేట్ చేసిన సీన్స్ ఆయన ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చేశాయి.
లేటెస్ట్ గా అధిక్ రవిచంద్రన్, నటసింహం బాలకృష్ణకు ఓ మాస్ కథ వినిపించాడని టాక్. ఆ కథ బాలయ్యకు నచ్చిందని, ఫుల్ నేరేషన్ తర్వాత నిర్ణయం తీసుకుందామని ఇద్దరూ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే అధిక్.. అజిత్‌తో మరో సినిమా ప్లాన్ చేసినా అది వెంటనే సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు లేవు. ఈనేపథ్యంలోనే బాలయ్యతో ప్రాజెక్ట్‌కి రెడీ అవుతున్నాడట.
ఇదిలా ఉండగా బాలయ్య ప్రస్తుతం 'అఖండ 2' షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న 'అఖండ 2' తర్వాత గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి వంటి డైరెక్టర్స్ లైన్లో ఉన్నారు. ఇంకా.. 'ఆదిత్య 999' ప్రాజెక్ట్ కూడా పైప్ లైన్లో ఉంది. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తాడనే ప్రచారం ఉంది. మొత్తంగా.. బాలయ్య-అధిక్ రవిచంద్రన్ ప్రాజెక్ట్‌పై ఏదైనా అఫీషియల్ అప్డేట్ వస్తుందేమో చూడాలి.