తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం వద్ద అగ్నిప్రమాదం
By : Dasari Suresh
Update: 2025-07-03 07:46 GMT
తిరుపతి లోని ప్రముఖ గోవిందరాజస్వామి వారి ఆలయం వద్ద అర్ధరాత్రి సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆలయం ప్రధాన ప్రవేశద్వారం సమీపంలో ఉన్న దుకాణాల పందిళ్లకు అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి.
ఈ ప్రమాదంలో పందిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదం ఉద్రిక్తత సృష్టించిన నేపథ్యంలో, సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన రెండు అగ్నిమాపక యంత్రాలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి.
ప్రమాదానికి గల అసలు కారణాలు ఇప్పటికీ తెలియరాలేదు. విచారణ కొనసాగుతోంది. అదేవిధంగా, ఈ ఘటన గతంలో ఇదే ప్రాంతంలో ఒక ఫోటో స్టూడియో అగ్నికి ఆహుతైన దుర్ఘటనను గుర్తు చేస్తోంది.