ప్రతి డాక్టర్ ఏడాదికి నెలరోజులు ప్రభుత్వ ఆసుపత్రిలో సేవ చేయాలి – సీఎం రేవంత్ రెడ్డి

ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా ముందుకు రావాలి-ప్రభుత్వ హాస్పిటళ్లలో సేవే నిజమైన మానవతా ధర్మం;

Update: 2025-07-04 09:22 GMT

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఇటీవల ఒక అత్యంత ప్రాసంగికమైన, మానవతా దృక్పథంతో కూడిన అభ్యర్థన చేశారు. ఆయన డాక్టర్లను ఉద్దేశిస్తూ అన్నారు.ప్రతి డాక్టర్ కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా, ఒక్క నెల రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయాలి. ఇది సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడంలో ఎంతో మేలు చేస్తుంది.

అలాగే, విదేశాల నుండి భారతదేశానికి వచ్చే డాక్టర్లకు కూడా ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి చేశారు.మీరు ఇక్కడికి వచ్చినప్పుడు, తప్పనిసరిగా ఒక వారం రోజులైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులను చూసి సేవ చేయండి. మీ విలువైన అనుభవం, ఇక్కడి ప్రజల కోసం ఒక జీవన ఆశగా మారుతుంది.


Full View


Tags:    

Similar News