‘ఓజీ‘ జోష్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్‘
‘ఓజీ’ బంపర్ హిట్‌తో పవన్ కళ్యాణ్ కెరీర్ మళ్లీ కొత్త ఊపు అందుకుంది. చాలా కాలం తర్వాత ఆయన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నాడు.;
‘ఓజీ’ బంపర్ హిట్‌తో పవన్ కళ్యాణ్ కెరీర్ మళ్లీ కొత్త ఊపు అందుకుంది. చాలా కాలం తర్వాత ఆయన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నాడు. ఈ విజయంతో పవర్ స్టార్ సినీ ఇమేజ్ మళ్లీ శిఖరానికి చేరుకుందని చెప్పొచ్చు. ఇక ‘ఓజీ‘ తర్వాత ఇప్పుడు అందరి చూపు సహజంగానే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై పడింది.
‘గబ్బర్ సింగ్‘ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్-హరీష్ శంకర్ కలయికలో రూపొందుతున్న సినిమా కావడం అంచనాలను మరింత పెంచుతుంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కొంచెం ప్యాచ్ వర్క్ మినహా మొత్తం షూటింగ్ వర్క్ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
‘ఓజీ‘ బంపర్ హిట్ సాధించడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్‘ ప్రీ రిలీజ్ బిజినెస్ కు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయట. మైత్రి మూవీ మేకర్స్ మాత్రం తొందరపడి నిర్ణయం తీసుకోకుండా, సరైన టైమ్ కోసం వేచి చూస్తుందట. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ చిత్రాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట.