బాక్సాఫీస్ వద్ద రిషబ్ రుద్రతాండవం!

బాక్సాఫీస్‌ వద్ద తాజా సంచలనం ‘కాంతార చాప్టర్ 1’. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రీక్వెల్ వరల్డ్ వైడ్ గా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది.;

By :  S D R
Update: 2025-10-03 09:40 GMT

బాక్సాఫీస్‌ వద్ద తాజా సంచలనం ‘కాంతార చాప్టర్ 1’. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రీక్వెల్ వరల్డ్ వైడ్ గా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఒకప్పుడు తన సినిమాకు ఒక్క షో కూడా దొరకని స్థితి నుంచి, ఈ రోజు దేశవ్యాప్తంగా వేల హౌస్‌ఫుల్ షోలు సాధించగలిగిన స్థాయికి రిషబ్ ఎదిగాడు. ఈ విషయం గురించి ఆయన పంచుకున్న ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇక ‘కాంతార చాప్టర్ 1’ తొలి రోజే ఇండియాలో రూ.80 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఓవర్సీస్ లోనూ మిలియన్ డాలర్ల వసూళ్లను కొల్లగొడుతుంది. ఒక్క బుక్ మై షోలోనే ఫస్ట్ డే 1.28 మిలియన్ టికెట్స్ అమ్ముడయ్యాయి. రెండో రోజూ గంటకు 70 వేల టికెట్లు బుక్ అవుతున్నాయి. డిస్ట్రిక్ యాప్లో కూడా భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఈ జోరు చూస్తుంటే ఫస్ట్ వీకెండ్‌కే సినిమా రూ.250 నుంచి 300 కోట్ల గ్రాస్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించగా, జయరామ్, గుల్షన్ దేవయ్య, కీలక పాత్రలు పోషించారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, ఫోక్ మ్యూజికల్ వైబ్స్‌తో థియేటర్లలో కొత్త అనుభూతిని పంచుతోంది. మొత్తంగా లాంగ్ రన్ లో ‘కాంతార చాప్టర్ 1‘ ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

Tags:    

Similar News