ఆసక్తికర టైటిల్ తో రవితేజ

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో ఒకటి భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ‘మాస్ జాతర‘ కాగా.. మరొకటి కిషోర్ తిరుమల డైరెక్షన్ లో రూపొందుతున్న చిత్రం.;

By :  S D R
Update: 2025-10-03 11:15 GMT

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో ఒకటి భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ‘మాస్ జాతర‘ కాగా.. మరొకటి కిషోర్ తిరుమల డైరెక్షన్ లో రూపొందుతున్న చిత్రం. రవితేజ 76వ చిత్రంగా కిషోర్ తిరుమల సినిమా తెరకెక్కుతుంది. మొదటి ఈ మూవీకోసం ‘అనార్కలీ‘ అనే టైటిల్ పరిశీలించినా.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన టైటిల్ ప్రచారంలోకి వచ్చింది.

రవితేజ 76 కోసం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి‘ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. రవితేజ మార్క్ యాక్షన్, కిషోర్ తిరుమల మార్క్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుందట. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ చిత్రం విడుదల తేదీ ఖరారు చేసుకుంది.

Tags:    

Similar News