టాలీవుడ్‌లో నెక్స్ట్ మ్యూజిక్ సెన్సేషన్!
'అర్జున్ రెడ్డి'తో గుర్తింపు తెచ్చుకున్న హర్షవర్ధన్ రామేశ్వర్, ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో దూసుకెళ్తున్నాడు. ‘యానిమల్’ చిత్రానికి అందించిన సంగీతంతో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న హర్షవర్ధన్ కు ఇప్పుడు వరుసగా క్రేజీ ప్రాజెక్టులు క్యూ కడుతున్నాయి.;
'అర్జున్ రెడ్డి'తో గుర్తింపు తెచ్చుకున్న హర్షవర్ధన్ రామేశ్వర్, ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో దూసుకెళ్తున్నాడు. ‘యానిమల్’ చిత్రానికి అందించిన సంగీతంతో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న హర్షవర్ధన్ కు ఇప్పుడు వరుసగా క్రేజీ ప్రాజెక్టులు క్యూ కడుతున్నాయి.
లేటెస్ట్ గా హర్షవర్ధన్ చేతికి ఒకేసారి రెండు స్టార్ ప్రాజెక్టులు వచ్చాయి. వాటిలో మొదటిది డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ. ఈ చిత్రం ‘పూరి సేతుపతి’ అనే వర్కింగ్ టైటిల్‌తో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకి హర్షవర్ధన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపిక చేసినట్లు పూరీ కనెక్ట్స్ అధికారికంగా ప్రకటించింది. పూరీ, ఛార్మీతో కలిసి హర్షవర్ధన్ దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక రెండో క్రేజీ ప్రాజెక్ట్ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వెంకీ 77'. కొత్త రకం సౌండ్ కావాలని భావించిన త్రివిక్రమ్, ఈసారి హర్షవర్ధన్ రామేశ్వర్ వైపు మొగ్గు చూపాడట. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయని టాక్.
‘యానిమల్’ విజయంతో పాన్ ఇండియా లెవెల్‌లో హర్షవర్ధన్ పేరు మార్మోగింది. ప్రభాస్–సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’కి కూడా ఆయనే సంగీతం అందిస్తున్నాడు. తక్కువ కాలంలోనే ఇంత భారీ ప్రాజెక్టుల వరుస ఆయన ప్రతిభకు నిదర్శనం. ప్రస్తుతం టాలీవుడ్‌లో దేవిశ్రీ ప్రసాద్, తమన్ వంటి సీనియర్ కంపోజర్స్‌తో పాటు హర్షవర్ధన్ రామేశ్వర్ కూడా నెక్స్ట్ జనరేషన్ మ్యూజిక్ పవర్‌గా ఎదుగుతున్నాడు.