రా అండ్ రస్టిక్ గా 'డ్యూడ్'

‘లవ్ టుడే, డ్రాగన్’ సినిమాలతో సూపర్‌ హిట్‌లు అందుకున్న యువ హీరో ప్రదీప్ రంగనాథన్, ఇప్పుడు మరో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌తో 'డ్యూడ్'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.;

By :  S D R
Update: 2025-10-09 13:28 GMT

‘లవ్ టుడే, డ్రాగన్’ సినిమాలతో సూపర్‌ హిట్‌లు అందుకున్న యువ హీరో ప్రదీప్ రంగనాథన్, ఇప్పుడు మరో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌తో 'డ్యూడ్'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రంలో మమితా బైజు, నేహా శెట్టి హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీర్తీశ్వరన్ దర్శకుడు. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజయ్యింది.

హీరో, హీరోయిన్‌ల మధ్య కెమిస్ట్రీ, రొమాంటిక్‌ ట్రాక్‌ తో 'డ్యూడ్' ట్రైలర్ ఆద్యంతం ప్రదీప్ రంగనాథన్ స్టైల్ లో రా అండ్ రస్టిక్ గా ఉంది. ట్రైలర్ లో 'జరిగేది ఏదీ మన చేతిలో ఉండదు' అని హీరో చెప్పే డైలాగ్‌ ఆసక్తిని రేపింది. సీనియర్ నటుడు శరత్‌కుమార్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. కామెడీ, ఎమోషన్‌ మేళవించిన సన్నివేశాలు, సాయి అభ్యంకర్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ ట్రైలర్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాయి.

అక్టోబర్ 17న దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో 'డ్యూడ్' ఆడియన్స్ ముందుకు వస్తోంది. ఇక.. ఈ దీపావళి బరిలో ఇప్పటికే 'తెలుసు కదా, కె-ర్యాంప్, మిత్రమండలి' వంటి యూత్‌ఫుల్ మూవీస్ ఉన్నాయి. మొత్తంగా.. దీపావళి బరిలో బాక్సాఫీస్ వద్ద యూత్ ఫుల్ మూవీస్ సందడి మామూలుగా ఉండదు.


Full View


Tags:    

Similar News