'బిగ్ బాస్ 9' సందడి షురూ!

తెలుగు టెలివిజన్‌పై భారీ క్రేజ్ సంపాదించుకున్న రియాలిటీ షో 'బిగ్ బాస్' తొమ్మిదో సీజన్‌తో మళ్లీ సందడి చేయబోతోంది. సెప్టెంబర్ 7 నుంచి ప్రసారం కానున్న ఈ సీజన్‌కు కూడా నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం.;

By :  S D R
Update: 2025-06-22 08:03 GMT

తెలుగు టెలివిజన్‌పై భారీ క్రేజ్ సంపాదించుకున్న రియాలిటీ షో 'బిగ్ బాస్' తొమ్మిదో సీజన్‌తో మళ్లీ సందడి చేయబోతోంది. సెప్టెంబర్ 7 నుంచి ప్రసారం కానున్న ఈ సీజన్‌కు కూడా నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. గత సీజన్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదన్న నేపథ్యంలో, ఈసారి షోను మరింత రక్తికట్టించేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సీజన్ 9లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల పేర్లతో లీకుల జాబితా హల్‌చల్ చేస్తోంది. ఇందులో టీవీ నటులు, యూట్యూబ్ స్టార్లు, సోషల్ మీడియా సెలబ్రిటీలతో పాటు కొంత మంది సినీ ప్రముఖుల పేర్లు కూడా ఉండటం ఆసక్తికరం. ముఖ్యంగా ఈసారి కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా నిలిచిన పర్సనాలిటీలు, గ్లామర్ డోస్ కలిగిన ఆర్టిస్టుల ఎంపికపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

లీకైన పేర్లలో ముఖ్యంగా వినిపిస్తున్న వారు.. సీరియల్ నటి తేజస్విని, కావ్య, దీపికా, దేబ్‌జాని. కాంట్రవర్సీతో పాపులర్ అయిన అలేఖ్య చిట్టి, కల్పికా గణేష్. యంగ్ హీరో సుమంత్ అశ్విన్, సీనియర్ నటుడు సాయి కిరణ్. జబర్దస్త్ ఫేమ్ ఇమ్మాన్యుయేల్, మై విలేజ్ షో అనిల్, యూట్యూబర్ శ్రావణి వర్మ. బుల్లితెర నటులు ముఖేష్ గౌడ్, జ్యోతిరాయ్, శివ కుమార్, హారిక, ఏక్‌నాథ్, సీతాకాంత్. ఇంకా సోషల్ మీడియాలో గ్లామర్‌గా గుర్తింపు పొందిన రీతూ చౌదరి, నటి నవ్యసామి వంటి వారు కంటెస్టెంట్స్ లిస్టులో ప్రధానంగా వినిపస్తున్నారు.

అయితే ఈ జాబితాపై బిగ్ బాస్ టీమ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ, ఈ పేర్లు ఇప్పటికే బిజీగా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. గత సీజన్ ఫీడ్‌బ్యాక్‌ను పరిగణలోకి తీసుకుని ఈసారి బిగ్ బాస్ టీమ్ మరింత ఆకర్షణీయంగా, కాంట్రవర్సీ, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News