బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి!

సమ్మర్ సీజన్ సైలెంట్ గా వెళ్లిపోయింది. ఈ ఏడాది వేసవిలో 'హిట్ 3' మినహా పెద్దగా విజయాలు లేవు. ఈ జూన్ నెలలో 'కుబేర' మంచి స్టార్ట్ అందించింది.;

By :  S D R
Update: 2025-06-22 13:19 GMT

సమ్మర్ సీజన్ సైలెంట్ గా వెళ్లిపోయింది. ఈ ఏడాది వేసవిలో 'హిట్ 3' మినహా పెద్దగా విజయాలు లేవు. ఈ జూన్ నెలలో 'కుబేర' మంచి స్టార్ట్ అందించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున – ధనుష్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కుబేర’ మొదటి రోజు మార్నింగ్ షోలలో సాధారణ స్పందన కనిపించినా, నైజాం, ఆంధ్ర, ఓవర్సీస్‌లో వచ్చిన పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ సినిమాను రెండో షో నుంచే హౌస్‌ఫుల్ బోర్డుల వైపు నడిపించింది.

'కుబేర' చాలా రోజుల తర్వాత టాలీవుడ్ థియేటర్లకు వచ్చిన బౌన్స్‌బ్యాక్ లాగా నిలిచింది. ఇదే ఊపులో వచ్చే వారం నుంచి వరుస సినిమాలు బాక్సాఫీస్ కి క్యూ కట్టబోతున్నాయి. జూన్ 27న మంచు విష్ణు 'కన్నప్ప' విడుదలకు ముస్తాబవుతుంది. మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్‌గా వస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ ఉండటం, పైగా కథలో ఆధ్యాత్మికత ఉండటంతో పాన్ ఇండియా ప్రేక్షకుల దృష్టి ఈ చిత్రంపై ఉంది. 'కుబేర' నుంచి వచ్చిన జోష్‌ను 'కన్నప్ప' పికప్ చేస్తే థియేటర్ల జోరు ఆగదు.

ఆ తర్వాత వారం అంటే జూలై 4న నితిన్ 'తమ్ముడు' విడుదల కాబోతుంది. దిల్ రాజు నిర్మాణంలో శ్రీరామ్ వేణు తెరకెక్కించిన ఈ చిత్రంపైనా మంచి బజ్ ఉంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి పేరొచ్చింది. ఈ సినిమా ద్వారా సీనియర్ హీరోయిన్ లయ రీ ఎంట్రీ ఇస్తుంది.

జూలై రెండో వారంలో 'ఘాటి' విడుదలకు ముస్తాబవుతుంది. 'వేదం' చిత్రం తర్వాత అనుష్క-క్రిష్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా ఇది. ఈ సినిమాలో అనుష్క ఓ గిరిజన యువతి పాత్రలో కనిపించబోతుంది. ఎప్పుడూ విలక్షణమైన కథాంశాలతో సినిమాలు చేసే క్రిష్ ఈ సినిమాలో మరో విభిన్నమైన కథాంశాన్ని ఆవిష్కరించబోతున్నాడు. జూలై 11న 'ఘాటి' విడుదలకు ముస్తాబవుతుంది.

జూలైలో రాబోతున్న క్రేజీ మూవీస్ లో 'హరిహర వీరమల్లు' ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటింగ్ మూవీ ఇది. చరిత్రను నేపథ్యంగా తీసుకుని ఫిక్షనల్ బ్యాక్‌డ్రాప్ లో క్రిష్ మొదలు పెట్టిన చిత్రమిది. అయితే.. ఈ సినిమా పూర్తి కాకుండానే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుని 'ఘాటి' సినిమాని మొదలుపెట్టాడు క్రిష్. అలా.. రెండు వారాల గ్యాప్ లోనే క్రిష్ రూపొందించిన 'ఘాటి, వీరమల్లు' ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. ఇంకా విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' కూడా జూలైలోనే రావాల్సి ఉంది. మొత్తంగా.. జూన్ 27న 'కన్నప్ప' నుంచి జూలై 24న 'హరిహర వీరమల్లు' వరకూ వారం వారం బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల సందడి నెలకొనబోతుంది.

Tags:    

Similar News