రవితేజ @76: షూటింగ్ స్టార్ట్!

టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉండే హీరోలలో మాస్ మహారాజ రవితేజ ముందు వరుసలో నిలుస్తాడు. అయితే.. ఆమధ్య గాయం కారణంగా కొన్ని నెలల పాటు షూటింగ్స్ కు గ్యాప్ ఇచ్చిన రవితేజ.. మళ్లీ ఇప్పుడు ఫుల్ వర్క్ మోడ్ లోకి వచ్చేశాడు.;

By :  S D R
Update: 2025-06-16 15:29 GMT

టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉండే హీరోలలో మాస్ మహారాజ రవితేజ ముందు వరుసలో నిలుస్తాడు. అయితే.. ఆమధ్య గాయం కారణంగా కొన్ని నెలల పాటు షూటింగ్స్ కు గ్యాప్ ఇచ్చిన రవితేజ.. మళ్లీ ఇప్పుడు ఫుల్ వర్క్ మోడ్ లోకి వచ్చేశాడు. ఇప్పటకే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లో 'మాస్ జాతర'ను పూర్తి చేసిన మాస్ రాజా.. ఇప్పుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో కొత్త సినిమాని షురూ చేశాడు.

రవితేజ 76వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈరోజు నుంచి షూటింగ్ మొదలు పెట్టుకుంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్లో ఈ షూటింగ్ షురూ అయ్యింది. ఈ షెడ్యూల్‌లో రవితేజతో పాటు ఇతర కీలక తారాగణం పాల్గొంటోంది. ఈ సినిమా కోసం రవితేజ స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నాడు.

ఈ సినిమా టెక్నికల్ టీమ్ విషయానికొస్తే.. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ప్రసాద్ మురెళ్ల సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు చేపట్టారు. హీరోయిన్ ఎంపిక విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. హ్యూమర్, ఎమోషన్స్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

Tags:    

Similar News