యూరప్‌లో ‘రాజా సాబ్‘ సందడి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – కమర్షియల్ డైరెక్టర్ మారుతీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ సినిమా ‘ది రాజా సాబ్’. ప్రస్తుతం ఈ సినిమాకోసం యూరప్‌లో పాటల చిత్రీకరణ జరుపుతున్నారు. హీరో, హీరోయిన్లపై రెండు పాటలను అక్కడ చిత్రీకరించనున్నారట.;

By :  S D R
Update: 2025-10-06 10:01 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – కమర్షియల్ డైరెక్టర్ మారుతీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ సినిమా ‘ది రాజా సాబ్’. ప్రస్తుతం ఈ సినిమాకోసం యూరప్‌లో పాటల చిత్రీకరణ జరుపుతున్నారు. హీరో, హీరోయిన్లపై రెండు పాటలను అక్కడ చిత్రీకరించనున్నారట. ‘ది రాజా సాబ్‘ యూరప్ షెడ్యూల్ కి సంబంధించి కొన్ని ఫోటోలు నెట్టింట జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలలో డైరెక్టర్ మారుతి, క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఎస్.కె.ఎన్., హీరోయిన్ నిధి అగర్వాల్ కనిపిస్తున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ హారర్ కామెడీ జానర్‌లో రూపొందుతోంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కథానాయికలు కాగా, సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ లో ప్రభాస్ లుక్‌, హారర్ టచ్‌, కామెడీ ఎలిమెంట్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 9 ‘ది రాజా సాబ్‘ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Tags:    

Similar News