‘కాంతార’ కలెక్షన్ల సునామీ
పాన్ ఇండియా స్థాయిలో ‘కాంతార‘ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 235 కోట్ల వసూళ్లు సాధించి, సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది.;
పాన్ ఇండియా స్థాయిలో ‘కాంతార‘ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 235 కోట్ల వసూళ్లు సాధించి, సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇక నాల్గవరోజు ఆదివారంతో ఈ సినిమా రూ.300 కోట్లు దాటుతుందనే అంచనాలున్నాయి.
నార్త్ అమెరికాలో కూడా ఈ చిత్రం డాలర్ల వర్షం కురిపిస్తుంది. అక్కడ మూడు రోజుల్లోనే 2.4 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 20 కోట్లకు పైగా) వసూలు చేయడం విశేషం. ముఖ్యంగా, కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కేరళలో ఈ సినిమాకి ఊహించని రేంజ్‌లో రెస్పాన్స్ వస్తోంది.
ప్రేక్షకులు థియేటర్లలో దేవతారాధనలా ఈ సినిమాను చూస్తుండగా, బుక్ మై షోలో ఇప్పటికే 5 మిలియన్ల టికెట్లు అమ్ముడవడం ఒక అద్భుతమైన రికార్డ్‌గా నిలిచింది. స్వీయ దర్శకత్వంలో రిషబ్ శెట్టి ప్రదర్శించిన నటన, అజనీష్ లోక్ నాథ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాలోని విజువల్ ట్రీట్మెంట్, డివోషనల్ ఎక్స్ పీరియన్స్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.