మెలోడి టచ్‌తో ‘మాస్ జాతర‘ సాంగ్
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వారం వారం కొత్త సినిమాల సందడి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా గడిచిన సెప్టెంబర్ నెల తెలుగు చిత్ర పరిశ్రమకు బాగా కలిసొచ్చింది.;
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వారం వారం కొత్త సినిమాల సందడి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా గడిచిన సెప్టెంబర్ నెల తెలుగు చిత్ర పరిశ్రమకు బాగా కలిసొచ్చింది. ఇదే ఊపులో ఇప్పుడు అక్టోబర్ లోనూ కంటిన్యూ చేయడానికి పలు కొత్త చిత్రాలు థియేటర్లకు క్యూ కట్టబోతున్నాయి. ఈ లిస్టులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ‘మాస్ జాతర‘.
మాస్ మహారాజ రవితేజ హీరోగా రైటర్ భాను భోగవరపు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 31న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈనేపథ్యంలో ప్రమోషన్స్ జోరందుకున్నాయి. రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు పాటలు రాగా.. లేటెస్ట్ గా థర్డ్ సింగిల్ 'హుడియో హుడియో' ను రిలీజ్ చేయబోతున్నారు. ఈరోజు ఈ పాట ప్రోమో రిలీజ్ చేశారు.
ఇప్పటివరకూ వచ్చిన రెండు పాటలు మాస్ అప్పీల్ తో ఉంటే.. ఇప్పుడు థర్డ్ సింగిల్ మెలోడియస్ గా ఆకట్టుకోబోతుంది. భీమ్స్ కంపోజ్ చేసిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా.. భీమ్స్, హేషమ్ అబ్దుల్ వాహబ్ ఆలపించారు.