'ఉస్తాద్' సెట్స్‌లోకి పవన్ ఎంట్రీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ ఎంటర్‌టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్'. గతంలో 'గబ్బర్ సింగ్‌'తో బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ఈ జోడీ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.;

By :  S D R
Update: 2025-06-12 01:33 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ ఎంటర్‌టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్'. గతంలో 'గబ్బర్ సింగ్‌'తో బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ఈ జోడీ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా, సంగీతం రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. జూన్ 10 ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ సెట్స్‌లో అడుగుపెట్టిన దృశ్యాలను మేకర్స్ ఒక స్పెషల్ వీడియోగా విడుదల చేశారు. ఈ వీడియోలో స్టైలిష్ గా 'ఉస్తాద్ భగత్ సింగ్' సెట్స్ లోకి అడుగుపెట్టిన పవన్ లుక్ ఆకట్టుకుంటుంది.

మైత్రి అధినేత రవిశంకర్ పవన్‌కు బొకే ఇచ్చి స్వాగతం పలకడం వీడియోలో హైలైట్‌గా నిలిచింది. ఈ షూట్ లో హీరోయిన్ శ్రీలీల కూడా పాల్గొంటుంది. ఈ షెడ్యూల్ సుమారు 30 రోజులు నాన్‌స్టాప్‌గా జరగనుంది. ఇందులో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. ఇక రాజకీయాల్లో బిజీగా ఉన్నా పవన్ తన సినిమాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాడు. ఇప్పటికే 'హరిహర వీరమల్లు, ఓజీ' చిత్రాల షూటింగ్స్ పూర్తి చేసిన పవన్, ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీని పూర్తి చేయాలని చూస్తున్నాడు.


Full View


Tags:    

Similar News