నవ్వుల ‘మిత్ర మండలి‘!
టాలీవుడ్ లో యాక్టివ్ గా ఉండే ప్రొడ్యూసర్స్ లో బన్నీ వాస్ ఒకరు. ఒకవైపు గీతా ఆర్ట్స్ 2 సంస్థకి నిర్మాతగా వ్యవహరిస్తున్న బన్నీ వాస్ ఇప్పుడు తన సొంత బ్యానర్ BV వర్క్స్ పై తొలి సినిమాను రూపొందిస్తున్నారు.;
టాలీవుడ్ లో యాక్టివ్ గా ఉండే ప్రొడ్యూసర్స్ లో బన్నీ వాస్ ఒకరు. ఒకవైపు గీతా ఆర్ట్స్ 2 సంస్థకి నిర్మాతగా వ్యవహరిస్తున్న బన్నీ వాస్ ఇప్పుడు తన సొంత బ్యానర్ BV వర్క్స్ పై తొలి సినిమాను రూపొందిస్తున్నారు. సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ తో బన్నీ వాస్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి‘.
ప్రియదర్శి, నిహారిక, వెన్నెల కిషోర్, రాగ్ మయూర్, విష్ణు, ప్రసాద్ బెహరా, వి.టి.వి. గణేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మిత్ర మండలి‘ టీజర్ రిలీజయ్యింది. క్రికెట్ కామెంటరీ స్టైల్లో టీజర్ ప్రారంభం కావడం, బాల్ లేకుండా క్రికెట్ ఆడటం, బోర్డు లేకుండా క్యారమ్స్ ఆడటం లాంటి హ్యూమర్ మూమెంట్స్ ప్రేక్షకులను నవ్వించేలా ఉన్నాయి.
హీరోగా వరుస విజయాలందుకుంటున్న ప్రియదర్శి ఈ మూవీలో మెయిన్ లీడ్ కాగా.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక ఎన్ఎం హీరోయిన్గా తెలుగు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తుంది. ఎస్. విజయేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి ఆర్.ఆర్. ధృవన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మొత్తంగా ‘మిత్ర మండలి‘ ఆడియన్స్ కు ఓ ఫన్ రైడ్ అందించబోతున్నట్టు టీజర్ ను బట్టి తెలుస్తోంది.