మళ్లీ తెరపైకి ‘మాయాబజార్‘

తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన ‘మాయాబజార్‘ చిత్రం విడుదలై 68 సంవత్సరాలు అయ్యింది. 1957 మార్చి 27న విడుదలై అపార విజయాన్ని సాధించిన ఈ సినిమాను మహానటుడు ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ఈ నెల మే 28న బలుసు రామారావు మళ్లీ విడుదల చేస్తున్నారు.;

By :  S D R
Update: 2025-05-20 10:50 GMT

తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన ‘మాయాబజార్‘ చిత్రం విడుదలై 68 సంవత్సరాలు అయ్యింది. 1957 మార్చి 27న విడుదలై అపార విజయాన్ని సాధించిన ఈ సినిమాను మహానటుడు ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ఈ నెల 28న బలుసు రామారావు మళ్లీ విడుదల చేస్తున్నారు.

ఎన్.టి. రామారావు (శ్రీకృష్ణుడు), అక్కినేని నాగేశ్వరరావు (అభిమన్యుడు), ఎస్.వి. రంగారావు (ఘటోత్కచుడు), సావిత్రి (శశిరేఖ) వంటి లెజెండ్స్ ఈ సినిమాలో నటించారు. విజయా ప్రొడక్షన్స్ పతాకంపై నాగిరెడ్డి – చక్రపాణి నిర్మించిన ఈ పౌరాణిక గాథకు, దర్శకుడు కె.వి. రెడ్డి తన వినూత్న ప్రతిభతో శాశ్వత రూపం ఇచ్చారు. ఘంటసాల సంగీతం, పింగళి నాగేంద్ర రావు మాటలు, మార్కస్ బార్ట్ లే ఛాయాగ్రహణం – ఇవన్నీ కలిసి ‘మాయాబజార్‘ను ఎవర్ గ్రీన్ గా నిలిపాయి.

ఈ నెల 28న ఐమ్యాక్స్‌ వంటి ప్రఖ్యాత థియేటర్లలో ఈ చిత్రం రంగులలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో TD జనార్దన్, రమేష్ ప్రసాద్, S.V కృష్ణారెడ్డి అచ్చి రెడ్డి, వీర శంకర్, భగీరథ, YJ రాంబాబు, త్రిపురనేని చిట్టి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ గారి పట్ల తనకున్న వీరాభిమానంతో ఈ చిత్రాన్ని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఈ సందర్భంగా బలుసు రామారావు అన్నారు.

Tags:    

Similar News