పవన్-కీరవాణి ఆత్మీయ సమ్మేళనం
మరకతమణి కీరవాణికి మెగా హీరోలతో అరుదైన రికార్డు ఉంది. ఇప్పటివరకూ చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ లకు తొలి చిత్రంతోనే సూపర్ హిట్స్ ఇచ్చిన కీరవాణి.. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి బంపర్ హిట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.;
మరకతమణి కీరవాణికి మెగా హీరోలతో అరుదైన రికార్డు ఉంది. ఇప్పటివరకూ చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ లకు తొలి చిత్రంతోనే సూపర్ హిట్స్ ఇచ్చిన కీరవాణి.. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి బంపర్ హిట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ‘హరిహర వీరమల్లు‘తో తొలిసారి పవన్-కీరవాణి కలిసి పనిచేస్తున్నారు.
ఇప్పటికే ‘హరిహర వీరమల్లు‘ నుంచి రెండు పాటలు విడుదలయ్యాయి. తాజాగా మూడో పాట ‘సలసల మరిగే నీలోని రక్తమే..‘ అనే పాట రాబోతుంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్.. ఎం.ఎం.కీరవాణి స్టూడియోను సందర్శించారు. తన నటనలో కీలకమైన ‘హరిహర వీరమల్లు‘ చిత్రానికి కీరవాణి అందించిన సంగీతం పట్ల కృతజ్ఞతగా, ఆప్యాయతగా ఈ సందర్శన జరిగింది.
ఈ సందర్భంగా పవన్ చేతుల మీదుగా కీరవాణి మరోసారి ఆస్కార్ అవార్డు అందుకోవడం విశేషం. ‘ఆస్కార్ ఎక్కడ?’ అన్న పవన్ ప్రశ్నకు స్పందనగా కీరవాణి తన గదిలోంచి అవార్డు తీసుకువచ్చి చూపించారు. ఆ అవార్డును పవన్ కళ్యాణ్ మళ్లీ కీరవాణికి అందజేశారు.
మరోవైపు కీరవాణి, తనకు ప్రత్యేకంగా ప్రియమైన 32 తెలుగు కథల సంకలనం మరియు తను రచించిన రెండు కథలతో కూడిన పుస్తకాన్ని పవన్‌కు బహుమతిగా ఇచ్చారు. కీరవాణి వయొలిన్‌లు, ఆయనకున్న సంగీతాభిమానాన్ని చూసి పవన్ తన సంగీతానికి సంబంధించిన గత జ్ఞాపకాలను పంచుకున్నారు. ఎ.ఎమ్.రత్నం నిర్మాణంలో జ్యోతికృష్ణ, క్రిష్ సంయుక్తంగా తెరకెక్కించిన ‘హరిహర వీరమల్లు‘ జూన్ 12న విడుదలవుతుంది.