‘హరిహర వీరమల్లు‘ మూడో పాట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారి నటిస్తున్న చారిత్రక చిత్రం ‘హరిహర వీరమల్లు‘. పేరుకు మొఘలుల కాలం నాటి చారిత్రక కథాంశంతో రూపొందినా ఇదొక ఫిక్షనల్ డ్రామా.;

By :  S D R
Update: 2025-05-19 10:50 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారి నటిస్తున్న చారిత్రక చిత్రం ‘హరిహర వీరమల్లు‘. పేరుకు మొఘలుల కాలం నాటి చారిత్రక కథాంశంతో రూపొందినా ఇదొక ఫిక్షనల్ డ్రామా. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎమ్.రత్నం నిర్మాణంలో క్రిష్, జ్యోతికృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘హరిహర వీరమల్లు‘ ఫస్ట్ పార్ట్ ‘స్వార్డ్ వర్సెస్ స్పిరిట్‘ జూన్ 12న విడుదలకు ముస్తాబవుతుంది.

ఆస్కార్ విజేత కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో కీరవాణికి ఇదే తొలి చిత్రం. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘మాట వినాలి, కొల్లగొట్టినాదిరో‘ పాటలు వచ్చాయి. ఇప్పుడు థర్డ్ సింగిల్ ‘అసుర హననమ్‘ రిలీజ్ కు రెడీ అవుతుంది. మే 21న ఈ పాటను విడుదల చేయబోతున్నారు. కీరవాణి స్వరకల్పనలో రాంబాబు గోశాల ఈ పాటను రాశారు.



Tags:    

Similar News