‘దేవర 2’కు ఆలస్యం తప్పదా?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైన్లో పెడుతున్నాడు. 'ఆర్.ఆర్.ఆర్' వంటి గ్లోబల్ హిట్ తర్వాత 'దేవర'తో మరోసారి తన మాస్ పవర్ చూపించాడు.;
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైన్లో పెడుతున్నాడు. 'ఆర్.ఆర్.ఆర్' వంటి గ్లోబల్ హిట్ తర్వాత 'దేవర'తో మరోసారి తన మాస్ పవర్ చూపించాడు. ఇప్పుడు బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తో 'వార్-2', ప్రశాంత్ నీల్ తో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలను లైన్లో పెట్టాడు. వీటిలో 'వార్ 2' ఆగస్టులో వస్తుండగా.. ప్రశాంత్ నీల్ మూవీ వచ్చే ఏడాది జూన్ లో రానుంది.
ఈ సినిమాలతో పాటు మరో మూడు చిత్రాలు తారక్ కిట్టీలో ఉన్నాయి. వాటిలో నెల్సన్ దిలీప్ కుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే చిత్రాలను ముందుగా ప్రస్తావించాలి. సితార ఎంటర్టైన్మెంట్స్ లో 'జైలర్' ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ తో ఓ డార్క్ కామెడీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఎన్టీఆర్. అలాగే హారిక అండ్ హాసిని లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ మైథలాజికల్ మూవీకీ కమిట్ మెంట్ ఇచ్చాడు.
అయితే ఎన్టీఆర్ మరో మోస్ట్ అవైటింగ్ మూవీ 'దేవర 2' పరిస్థితి ఏంటనేదే ప్రశ్న. ఇప్పటికే ఘన విజయాన్ని సాధించిన 'దేవర' చిత్రానికి సీక్వెల్ గా 'దేవర 2' ఉంటుందని ప్రకటించారు మేకర్స్. ఆమధ్య 'దేవర' జపాన్ లో విడుదలైన సమయంలోనూ సీక్వెల్ పై మరోసారి కన్ఫమ్ చేశారు. ప్రెజెంట్ ఎన్టీఆర్ లైనప్ చూస్తే.. 'దేవర 2' ఇప్పట్లో ఉంటుందా? లేదా? అనే సస్పెన్స్ నెలకొంది.