పవన్ కళ్యాణ్ తో ధనుష్ సినిమా?

తమిళ సినీ పరిశ్రమలో నటుడిగా తనదైన ముద్ర వేసుకున్నవాడు ధనుష్. ఈతరం నటుల్లో రెండుసార్లు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డులు అందుకున్న ఘనత కూడా ధనుష్ సొంతం.;

By :  S D R
Update: 2025-06-16 00:40 GMT

తమిళ సినీ పరిశ్రమలో నటుడిగా తనదైన ముద్ర వేసుకున్నవాడు ధనుష్. ఈతరం నటుల్లో రెండుసార్లు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డులు అందుకున్న ఘనత కూడా ధనుష్ సొంతం. అయితే నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ధనుష్.

తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘కుబేర’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న ధనుష్, తెలుగు ప్రేక్షకుల హృదయాలకు మరింత దగ్గరయ్యే కామెంట్ చేశాడు. 'తెలుగులో దర్శకత్వం వహించే అవకాశం వస్తే ఎవరితో చేయాలనుకుంటారు?' అన్న ప్రశ్నకు ఏమాత్రం ఆలస్యం లేకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించాడు.

ధనుష్ దర్శకత్వంలో వచ్చిన 'పవర్ పాండి, రాయన్' ఘన విజయాలు సాధించాయి. మూడో చిత్రం 'జాబిలమ్మ నీకు అంతమా' చిత్రంకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం తానే హీరోగా నటిస్తూ 'ఇడ్లీ కడై' సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మరి.. త్వరలో పవన్ కళ్యాణ్‌ ని డైరెక్ట్ చేసే అవకాశం ధనుష్ కి వస్తుందేమో చూడాలి. మరోవైపు జూన్ 20న ధనుష్ నటించిన 'కుబేర' ఆడియన్స్ ముందుకు వస్తోంది.

Tags:    

Similar News