అబ్దుల్ 'కలాం'గా ధనుష్
భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం బయోపిక్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ బయోపిక్ లో 'కలాం'గా విలక్షణ నటుడు ధనుష్ కనిపించబోతున్నాడు.;
భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం బయోపిక్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ బయోపిక్ లో 'కలాం'గా విలక్షణ నటుడు ధనుష్ కనిపించబోతున్నాడు. జాతీయ స్థాయిలో రెండుసార్లు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న ధనుష్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో ఇళయరాజా బయోపిక్ కూడా ఉంది.
మ్యూజికల్ మ్యాస్ట్రో ఇళయరాజా బయోపిక్ తో పాటు తాజాగా భారతదేశానికి గర్వకారణమైన కలాం గానూ అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చి ‘మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా ఎదిగిన కలాం.. ఆ తర్వాత భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేశారు. అలా ఆయన జీవితం ఎందరికో ఆదర్శం. ఈ చిత్రానికి 'తానాజీ, ఆదిపురుష్' ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు.
టి-సిరీస్ తో కలిసి తెలుగు నిర్మాణ సంస్థలైన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా ఈ మూవీ పోస్టర్ ను ఆవిష్కరించారు.