రాహుల్ గాంధీకి ఏపీపై మౌనం ఎందుకు? – జగన్
చంద్రబాబు, రేవంత్‌తో కాంగ్రెస్ హైకమాండ్ అనుబంధం ఉందని జగన్ విమర్శ - 12% ఓట్ల తేడా, 40 లక్షల ఓట్లు ఎలా? – ఈసీపై జగన్ సందేహాలు;
గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఈసీ ఓట్ల చోరీ చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై, వైఎస్సార్‌సీపీ అధినేత మరియు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. బీజేపీ ఉపఎన్నికల్లో చీటింగ్ చేసిందన్న ఆరోపణలపై మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.
జగన్ మాట్లాడుతూ – “రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు?” అని నేరుగా ప్రశ్నించారు. ఏపీ ఇన్‌సైడర్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా చంద్రబాబు విషయంపై ఒక్క మాట ఎందుకు మాట్లాడలేదని విమర్శించారు. ఈ రాష్ట్రంలో మద్యం బెల్ట్ షాపులు పెరుగుతున్నాయి, ఇసుక మరియు భూమి అక్రమాలు జరుగుతున్నాయి. వీటి గురించి ఎందుకు మాట్లాడటం లేదు?” అని ప్రశ్నించారు.
జగన్ అభిప్రాయంలో, ఇందుకు కారణం కాంగ్రెస్ హైకమాండ్, చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిఅందరూ ఒకే లైన్‌లో ఉండటమే. అందుకే రాహుల్ గాంధీ ఏపీ విషయంపై నిశ్శబ్దంగా ఉన్నారని ఆయన ఆరోపించారు.
అలాగే, 2024లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో 12 శాతం ఓట్ల తేడా ఎలా వచ్చిందో ఇప్పటికీ ఈసీ స్పష్టత ఇవ్వలేదని జగన్ గుర్తు చేశారు. దాదాపు 40 లక్షల ఓట్ల తేడా గురించి రాహుల్ గాంధీ ఒక్క మాట కూడా చెప్పలేదని ఆయన విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో జగన్, ఏపీ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించారు.