అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు!

నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ తన 65వ జన్మదినాన్ని హైదరాబాద్‌లో అభిమానుల సమక్షంలో వైభవంగా జరుపుకున్నారు. ఆయన భారీ కేక్‌ను కట్ చేసి, అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు.;

By :  S D R
Update: 2025-06-10 14:46 GMT

నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ తన 65వ జన్మదినాన్ని హైదరాబాద్‌లో అభిమానుల సమక్షంలో వైభవంగా జరుపుకున్నారు. ఆయన భారీ కేక్‌ను కట్ చేసి, అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ర్యాలీలు, సేవా కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నటుడిగానే కాకుండా, హిందూపురం శాసనసభ్యుడిగా, బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా బాలకృష్ణ ప్రజలకు సేవ చేస్తున్నారు. అభిమానులు ఆయనను 'మా దైవం, మా ధైర్యం, మనసున్న రారాజు' అంటూ ఆరాధిస్తారు. మొత్తంగా 'జై బాలయ్య, జై జై బాలయ్య' అంటూ అభిమానుల కేరింతల మధ్య ఈ 65వ జన్మదినం చిరస్థాయిగా నిలిచిపోనుంది.

Tags:    

Similar News