జపాన్ మీడియాతో ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న ఫోటోలు!
జపాన్ మీడియాతో ఎన్టీఆర్..;
మన సినిమాలు గ్లోబల్ లెవెల్ లో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను మాత్రమే కాదు.. చైనా, జపాన్ వంటి దేశాల్లోని అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ‘ఆర్.ఆర్.ఆర్‘తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జపాన్ ఆడియన్స్ లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈనేపథ్యంలోనే తన ‘దేవర‘ చిత్రాన్ని జపాన్ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లబోతున్నాడు.
మార్చి 28న జపాన్ లో ‘దేవర‘ గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా మార్చి 22న ఎన్టీఆర్ జపాన్ దేశాన్ని సందర్శించి అక్కడ ‘దేవర‘ను భారీ స్థాయిలో ప్రమోట్ చేయబోతున్నాడు. ఇక అంతకంటే ముందే తాజాగా జపనీస్ మీడియాతో ముచ్చటించాడు తారక్. అందుకు సంబంధించి ఓ రెండు ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి.
మొత్తంగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతో కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర‘ పాన్ ఇండియా లెవెల్ లో దుమ్మురేపింది. రాజమౌళితో సినిమా చేసిన హీరోలకు వెంటనే ఫ్లాప్ వస్తుంది అనే సెంటిమెంట్ ను ‘దేవర‘తో బ్రేక్ చేశాడు తారక్.