విశ్వక్ సేన్ ఇంట్లో చోరీ!
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ ఫిలింనగర్ రోడ్డు నం. 8లో ఉన్న ఆయన నివాసంలోకి ఓ దుండగుడు చొరబడి, విశ్వక్ సేన్ సోదరి వన్మయి గదిలో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యాడు.;
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ ఫిలింనగర్ రోడ్డు నం. 8లో ఉన్న ఆయన నివాసంలోకి ఓ దుండగుడు చొరబడి, విశ్వక్ సేన్ సోదరి వన్మయి గదిలో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యాడు.
ఈ ఘటనపై విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించి, ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు.
తాజా వివరాల ప్రకారం, తెల్లవారుజామున 5:50 గంటల సమయంలో ఓ అనుమానాస్పద వ్యక్తి బైక్‌పై వచ్చి ఇంటి గేటు తెరిచి, మూడో అంతస్తులోని వన్మయి గదిలో చొరబడి, 20 నిమిషాల్లోనే చోరీ చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపడుతున్నారు.