అందానికి మించిన ఆత్మసౌందర్యం

శ్రీలీల అందం మాత్రమే కాదు, ఆమె మంచి హృదయం కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. తక్కువ వయసులోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన శ్రీలీల తన మంచి మనసుతోనూ అభిమానులను ఆకట్టుకుంటోంది.;

By :  S D R
Update: 2025-04-28 10:33 GMT

శ్రీలీల అందం మాత్రమే కాదు, ఆమె మంచి హృదయం కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. తక్కువ వయసులోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన శ్రీలీల తన మంచి మనసుతోనూ అభిమానులను ఆకట్టుకుంటోంది.

శ్రీలీల ఇప్పటికే ఇద్దరు వికలాంగ పిల్లలను దత్తత తీసుకుని తల్లి మమకారంతో పెంచుతుండడం గొప్ప విషయం. తాజాగా మరో చిన్నారిని తన కుటుంబంలోకి చేర్చుకోవడం ద్వారా ఆమె ఉన్నతమైన మనసును మరోసారి చాటింది. 'ఇంటికి మరొకరు, హృదయాలను నింపేందుకు వచ్చింది' అంటూ శ్రీలీల ఓ ఫోటోను షేర్ చేసిన తీరు నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

చాలామంది సెలబ్రిటీలు సామాజిక బాధ్యతలు పట్టించుకోని ఈ రోజుల్లో, శ్రీలీల తన బిజీ షెడ్యూల్ మధ్యలోనూ పిల్లలకు ప్రేమతో సమయం కేటాయిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. అందానికి మంచితనాన్ని జోడించిన ఈ నటికి, అభిమానులు పెద్దఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.

వర్క్ ఫ్రంట్ లోకి వస్తే, 'పుష్ప 2'లోని స్పెషల్ నంబర్ తో పాన్ ఇండియా వైడ్ గుర్తింపు పొందిన శ్రీలీల.. ఇప్పుడు బాలీవుడ్ లో 'ఆశిఖి 3' వంటి పలు సినిమాలను లైన్లో పెట్టింది. మరోవైపు తెలుగులోనూ 'మాస్ జాతర, లెనిన్' వంటి సినిమాలున్నాయి. తమిళంలో శివ కార్తికేయన్ తో 'పరాశక్తి' సినిమాలో నటిస్తుంది.



Tags:    

Similar News