సాయిపల్లవి ప్రధాన అభిరుచి ఇదే !
తేనెటీగలను పెంచడం, తేనెను సేకరించడం వంటి అంశాలపై అవగాహన పెంచుకుంటూ.. అందులో ఆనందాన్ని వెతుక్కుంటోంది.;
సౌత్ ఇండియన్ టాలెంటెడ్ బ్యూటీ సాయిపల్లవి తీరిక వేళల్లో ఏం చేస్తుందో తెలుసా? మిగతా హీరోయిన్లు సినిమాలు చూడడం, పుస్తకాలు చదవడం, వంట చేయడం లాంటి పనులతో కాలక్షేపం చేస్తే.. ఈ నేచురల్ బ్యూటీ మాత్రం తేనెటీగల పెంపకంలో ఆసక్తి కనబరుస్తుండడం ఆశ్చర్యం అనిపించకమానదు.
ఆమెకు ఎపీకల్చర్ అంటే ప్రత్యేకమైన మక్కువ. తేనెటీగలను పెంచడం, తేనెను సేకరించడం వంటి అంశాలపై అవగాహన పెంచుకుంటూ.. అందులో ఆనందాన్ని వెతుక్కుంటోంది. తనకు ఇది చాలా ఉత్సాహాన్నిస్తుందని చెప్పిన సాయిపల్లవి, ఖాళీ సమయాల్లో తోట పనులను పర్యవేక్షించడం కూడా మర్చిపోదు.
ఆమె తోటలో ప్యాషన్ ఫ్రూట్స్ పెరుగుతున్నాయి. వాటిని కోసుకొని తినడం తనకు ఎంతగానో ఇష్టమట. అయితే, ఎంతలా ప్రకృతిని ప్రేమించినా, వంటింట్లో కాలం గడపడం మాత్రం తనకు నచ్చదని చెప్పేసింది. ఈ పనులన్నింటికీ తోడుగా, విరామం దొరికినప్పుడల్లా మంచి నిద్రకు ప్రాధాన్యం ఇస్తానని చెబుతోంది ఈ చలాకీ నటి. మొత్తానికి ఆమె తేనెటీగెల పెంపకం హాబీ మాత్రం అభిమానులు మెచ్చుకుంటున్నారు.