వివాదంపై స్పందించిన రచ్చ రవి

తెలుగు సినీ గాయని మంగ్లీ బర్త్ డే పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలు వివాదాస్పదంగా మారాయి. ఈ విషయం సోషల్ మీడియా, వార్తా మాధ్యమాలలో తీవ్ర చర్చనీయాంశమైంది.;

By :  S D R
Update: 2025-06-11 12:26 GMT

తెలుగు సినీ గాయని మంగ్లీ బర్త్ డే పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలు వివాదాస్పదంగా మారాయి. ఈ విషయం సోషల్ మీడియా, వార్తా మాధ్యమాలలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక ఈ బర్త్ డే పార్టీలో నటుడు రచ్చ రవి కూడా ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై రచ్చ రవి క్లారిటీ ఇస్తూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు.

మంగ్లీ బర్త్ డే పార్టీకి తాను హాజరు కాలేదని రచ్చ రవి తెలిపాడు. గత కొన్ని రోజులుగా తాను షూటింగ్ షెడ్యూల్స్ తో పూర్తిగా బిజీగా ఉన్నట్టు తెలిపాడు. దయచేసి ఎటువంటి వార్తలలోనైనా పేరును పేర్కొనడానికి ముందు వాస్తవాలను ఖచ్చితంగా పరిశీలించండి అంటూ తన నోట్ లో రచ్చ రవి తెలియజేశాడు.

Tags:    

Similar News