మనోజ్ సర్‌ప్రైజ్‌కి లక్ష్మి భావోద్వేగం

ఇప్పటికే దుమారం రేపిన మంచు ఫ్యామిలీ అంతర్గత కలహాలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. తాజాగా మోహన్‌బాబు ఇంటి వద్ద ఆందోళనకు దిగిన మనోజ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.;

By :  S D R
Update: 2025-04-13 09:38 GMT

ఇప్పటికే దుమారం రేపిన మంచు ఫ్యామిలీ అంతర్గత కలహాలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. తాజాగా మోహన్‌బాబు ఇంటి వద్ద ఆందోళనకు దిగిన మనోజ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ క్రమంలో ఫ్యామిలీలో కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణాన్ని పట్టించుకోకుండా మంచు లక్ష్మి మాత్రం తన సామాజిక బాధ్యతలను ముందుకు తీసుకెళ్తోంది.

'టీచ్ ఫర్ ఛేంజ్' ఫండ్‌రైజర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ఆమె, తన కూతురితో కలిసి ర్యాంప్ వాక్ చేసి అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ ఈవెంట్‌లో జరిగిన ఓ ఓ విషయం అందరికీ కంటనీరు తెప్పించింది.

కార్యక్రమం మధ్యలో అనూహ్యంగా మంచు మనోజ్, ఆయన భార్య మౌనిక అక్కడికి వచ్చి లక్ష్మికి సర్‌ప్రైజ్ ఇచ్చారు. స్టేజీపై తమ్ముడిని చూసిన లక్ష్మి ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసింది. తన తమ్ముడిని పట్టుకుని కళ్లలో నీళ్లతో తడిసి ముద్దైంది. ఆ క్షణం మొత్తంగా, కుటుంబ అనుబంధానికి ప్రతీకగా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.




Tags:    

Similar News