చిన్ననాటి స్నేహితుడే వరుడు
నటి అభినయ త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టబోతోంది. ‘శంభో శివ శంభో, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి తెలుగు చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకుంది అభినయ.;
నటి అభినయ త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టబోతోంది. ‘శంభో శివ శంభో, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి తెలుగు చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకుంది అభినయ. ముఖ్యంగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలోని చిన్ని పాత్రతో మంచి గుర్తింపు పొందింది.
ఇటీవల, సోషల్‌మీడియా ద్వారా తన పెళ్లి విషయాన్ని వెల్లడించిన అభినయ, తనకు కాబోయే భర్త సన్నీ వర్మను ప్రపంచానికి పరిచయం చేసింది. మార్చి 9న వీరిద్దరి నిశ్చితార్థం జరిగినట్టు తెలిపింది. సన్నీ వర్మ ఒక ప్రముఖ అంతర్జాతీయ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నారని సమాచారం.
ఇప్పటికే 15 ఏళ్లుగా వీరి మధ్య బంధం కొనసాగుతుందని అభినయ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. చిన్ననాటి స్నేహితులుగా మొదలైన వీరి సంబంధం, కాలక్రమేణా ప్రేమగా మారిందని, ఎలాంటి భయం లేకుండా తన వ్యక్తిగత విషయాలన్నింటినీ అతనితో పంచుకోగలుగుతానని ఆమె చెప్పింది.
తెలుగు, తమిళ, మలయాళం చిత్రాలలో అవకాశాలు అందుకుంటూ, తన అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అభినయ, ఇప్పుడు తన ప్రేమించిన వ్యక్తితో జీవితం కొనసాగించేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే వీరి వివాహం జరగనుంది.