ఆగస్టు 26న విశాఖలో రెండు యుద్ధనౌకల జలప్రవేశం

స్వదేశీ సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఉదయగిరి (F-35), హిమగిరి (F-34) - ఒకే రోజు, ఒకే వేదికపై రెండు జలప్రవేశాలు;

Update: 2025-08-11 09:13 GMT

భారత నౌకాదళం ఈ నెల 26న విశాఖపట్నంలో ఒక ప్రత్యేక చరిత్ర సృష్టించబోతోంది. ఈస్టర్న్ నావల్ కమాండ్‌ ప్రధాన కేంద్రంలో ఒకేసారి రెండు అత్యాధునిక యుద్ధనౌకలను జలప్రవేశం చేయనున్నారు. ఈ రెండు నౌకల పేర్లు ఉదయగిరి (F-35) , హిమగిరి (F-34), వీటిని స్వదేశీ సాంకేతికతతో, ఆధునిక యుద్ధ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించారు.

ఈ రెండు నౌకలు ప్రాజెక్ట్ 17A కింద నిర్మించబడ్డ ఆధునిక స్టెల్త్ ఫ్రిగేట్‌లు. రాడార్‌కు కనిపించకుండా ఉండే విధంగా ప్రత్యేక రూపకల్పన (stealth design) చేశారు. ఉదయగిరిని మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ముంబై)లో, హిమగిరిని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ & ఇంజినీర్స్ (కోల్‌కతా)లో నిర్మించారు. వీటి రూపకల్పనను భారత నౌకాదళం యొక్క Warship Design Bureau రూపొందించింది.

ఈ నౌకలు సుమారు 6,700 టన్నుల బరువు కలిగి ఉంటాయి. వీటిలో డీజిల్ ఇంజిన్ లేదా గ్యాస్ టర్బైన్‌తో నౌకను నడిపే మిశ్రమ శక్తి వ్యవస్థ (CODOG propulsion system) అమర్చబడింది, అంటే డీజిల్ ఇంజిన్లు మరియు గ్యాస్ టర్బైన్‌లు కలిపి నడిపే వ్యవస్థ. అలాగే ఆధునిక సెన్సార్‌లు,అంటే ఓ నౌకలోని అన్ని ప్రధాన వ్యవస్థలను (శక్తి ఉత్పత్తి, యంత్రాలు, విద్యుత్, ఇంధనం, గాలి నియంత్రణ, భద్రత పరికరాలు మొదలైనవి) ఒకే చోటు నుంచి, కంప్యూటర్ ఆధారంగా, కేంద్రీకృతంగా పర్యవేక్షించి నియంత్రించే సాంకేతిక వ్యవస్థ, Integrated Platform Management System (IPMS) వంటి సాంకేతిక సౌకర్యాలు ఉన్నాయి. ఆయుధాల పరంగా సూపర్‌సోనిక్ సర్పేస్-టు-సర్పేస్ మిస్సైల్‌లు, మీడియం రేంజ్ సర్పేస్-టు-ఎయిర్ మిస్సైల్‌లు, 76 మిమీ మెయిన్ గన్, చిన్న పరిమాణ తుపాకులు, ఆంటీ-సబ్‌మెరిన్ యుద్ధ సామగ్రి వంటి విభిన్న సదుపాయాలు ఉన్నాయి.

ఈ రెండు నౌకల నిర్మాణంలో 200కి పైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEs) పాల్గొన్నాయి.ఈ నిర్మాణ కార్యక్రమం ద్వారా దాదాపు 4,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, అలాగే 10,000కుపైగా పరోక్ష ఉపాధి అవకాశాలు లభించాయి.ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ మరియు ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాలకు ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది.

ఒకే రోజు, ఒకే వేదికపై రెండు యుద్ధనౌకలను జలప్రవేశం చేయడం భారత నౌకాదళ చరిత్రలో చాలా అరుదైన విషయం. ఈ ఘట్టం ద్వారా భారత సముద్ర రక్షణ శక్తి మరింత బలపడనుంది. ఈ నౌకలు భవిష్యత్తులో సముద్ర భద్రత, వ్యూహాత్మక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి.

Tags:    

Similar News