ఆగస్ట్ 25 నుంచి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డులు

ఆగస్ట్ 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం - 1.46 కోట్ల కుటుంబాలకు ATM కార్డు పరిమాణంలో స్మార్ట్ రేషన్ కార్డులు;

Update: 2025-08-11 12:11 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయబోతోంది. ఇవి ఏటీఎం కార్డు పరిమాణంలో ఉండి, ఒకవైపు ప్రభుత్వ లోగో, మరోవైపు కుటుంబ పెద్ద ఫొటో ఉంటాయి. కార్డులో ఉండే QR కోడ్‌ ద్వారా రేషన్ పంపిణీ మరింత పారదర్శకంగా జరుగుతుంది.మొత్తం 1.46 కోట్ల కుటుంబాలకు ఈ కొత్త కార్డులు అందజేయబడతాయి. ఇప్పటికే 96.05% కుటుంబాలు KYC ప్రక్రియ పూర్తి చేశాయి. 5 సంవత్సరాల లోపు పిల్లలు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు KYC మినహాయింపు ఇచ్చారు.

ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ సరఫరా చేస్తారు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రెండు సెషన్లలో పంపిణీ జరుగుతుంది. 65 ఏళ్లు పైబడినవారికి, అలాగే వికలాంగులకు ప్రతి నెల చివర్లో 26 నుంచి 30 తేదీల మధ్య రేషన్ ఇంటికి చేరవేస్తారు.ఈ కొత్త కార్డుల ద్వారా నకిలీ రేషన్ కార్డులను, డూప్లికేట్ లబ్ధిదారులను తొలగించడంమే లక్ష్యంగా ఈ మార్పులను తీసుకొచ్చారు. అలాగే రేషన్ సరఫరా వ్యవస్థలో పారదర్శకత పెంచి, ప్రజలకు వేగంగా, సులభంగా సేవలు అందించాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తుంది.

Tags:    

Similar News