కష్టాల్లో కాంగ్రెస్ జెండా మోసినవారే నిజమైన కార్యకర్తలు !ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిలా రెడ్డి

విభజన హామీలు నెరవేరిస్తాం – అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా వాస్తవం అవుతుంది;

Update: 2025-06-30 10:00 GMT

కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ఉన్నవారు, సిద్ధాంతాలను గౌరవించే వారు ముందుకు రావాలి అని కోరారు. నాయకత్వంపై నమ్మకం ఉన్నవారు, రాజకీయ ఆకాంక్షలతో భవిష్యత్తులో ఎమ్మెల్యేగా ఎదగాలనుకునే వారు, రిసోర్సులున్న వారు మీరు ఎక్కడ ఉన్నా, మీకు కాంగ్రెస్ పార్టీ తెరలేని ఆహ్వానం పలుకుతుంది అన్నారు షర్మిల.

ఈ సందర్భంగా ఏపీసీసీ చీఫ్ మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు చరిత్రను మోసినవారు కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ జెండాను నెత్తిన పెట్టినవారు,ప్రతి జిల్లాలో ఉన్న వారి తపనను చూస్తే గర్వంగా ఉంది.ఇది మా మీద మీకు ఉన్న విశ్వాసం రాష్ట్రంలో కాంగ్రెస్ పునరుజ్జీవనాన్ని కోరుతున్న కోట్లాది మంది ప్రజల ఆశయం అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అంటే స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ,ఈ దేశాన్ని నిర్మించిన పార్టీ.అనేక త్యాగాల పునాది మీద నిర్మితమైన పార్టీ అని గుర్తు చేసారు.సోనియా గాంధీ పదవిని త్యాగం చేసి, రాహుల్ గాంధీ నేడు ప్రజల కోసం పోరాటాలు చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు షర్మిలా రెడ్డి .కాంగ్రెస్ దగ్గర మానవ వనరులు, సిద్ధాంతాలు, నాయకత్వం, నిబద్ధత అన్నీ ఉన్నాయి. కానీ రాజకీయ పోరాటానికి కావలసిన మౌలిక వనరులు ఇంకా లేవు.ఈ స్థితిలో, సిద్ధాంతాలను గౌరవించే మీరు, పార్టీకి కొత్త శక్తిని అందించగల మీరు ముందుకు రండి పిలుపును ఇచ్చారు షర్మిల.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విభజన హామీలు అమలవుతాయి,రాష్ట్రానికి ప్రత్యేక హోదా వాస్తవం అవుతుంది అన్నారు.

రాజధాని నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తాం అని హామీ ఇచ్చారు ఏపీసీసీ చీఫ్.రాష్ట్ర విభజన అనేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయలేదు,అందరూ ఒప్పుకొని చేసిన నిర్ణయమే అది అని గుర్తు చేసారు.రాష్ట్ర అభివృద్ధి పదంలో నడకపోవడానికి విభజన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడమే అసలు కారణం అని విచారం వ్యక్తం చేసారు.అప్పుడు అధికారంలోకి వచ్చి ఉంటే, ప్రజలకు న్యాయం జరిగేది ఉద్గాటించారు.

మీరెవరు అయినా యువ నాయకులు కావచ్చు, మాజీ ప్రజా ప్రతినిధులు కావచ్చు, సామాన్య కార్యకర్తలు కావచ్చు మీరు నిజంగా ప్రజాసేవ చేయాలనుకుంటే, ఇప్పుడు నుంచే ముందుకు రావాలి అని షర్మిలా పిలుపునిచ్చారు.చివరి నిమిషంలో వచ్చి టికెట్ ఆశించడం కరెక్ట్ కాదు అన్నారు.నాలుగేళ్ల పాటు ప్రజల్లో ఉంటేనే ప్రజానాయకుడిగా ఎదగగలం అధికార ప్రతిపక్షాల చేస్తున్న తప్పుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఇప్పటి నుండే పోరాటం మొదలు పెడదాం అన్నారు షర్మిల రెడ్డి

Tags:    

Similar News