బీహార్‌లో కాంగ్రెస్ ప్రచారంలో రేవంత్ రెడ్డి

ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలిపిన వెంటనే బీహార్ యాత్రలో రేవంత్ చురుకైన పాత్ర;

Update: 2025-08-26 12:52 GMT

తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రచార యాత్ర బీహార్‌లో హోరాహోరీగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి యాత్ర నిర్వహించారు. రేవంత్ రెడ్డి మొన్న ఉపరాష్ట్రపతి అభ్యర్ధిని మద్దతు ప్రకటించిన తర్వాత, ఈ యాత్రలో చురుకైన పాత్ర పోషించి పార్టీ కార్యకర్తల మధ్య ఉత్సాహాన్ని పెంచారు.

వైరల్ ఫొటోలలో రాహుల్-ప్రియాంక మధ్య టాప్ వాహనంలో రేవంత్ రెడ్డి హాజరైన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ యాత్రలో తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్, మంత్రులు వాకిటీ శ్రీహరి, సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పార్టీ వర్గాల ప్రకారం, రేవంత్ రెడ్డి చేర్పు స్థానిక కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచడమే కాక, బీహార్ లో కాంగ్రెస్ ప్రచారాన్ని మరింత బలపరిచినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News