తెలంగాణకు వాతావరణశాఖ హెచ్చరిక..రేపటినుండి భారీ వర్షాలు
తెలంగాణ జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీచేసిన వాతావరణశాఖ;
తెలంగాణ లో వాతావరణం రోజుకు ఒకలాగా ఉంటుంది.ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని పరిస్థితి,వర్షాలు సరిగా పడక వాతావరణం ఇంకా చల్ల పడలేదు.రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు పడతాయి అని హైదరాబాద్ వాతావరణశాఖ తెలియచేసింది.కొన్నిప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అలానే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో తీవ్ర వర్షాలు, ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది అని వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీచేసింది.
అలాగే తెలంగాణ జిల్లాలలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు ,ఈదురు గాలులు వేసే అవకాశం ఉంది అని ,ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హైదరాబాద్ వాతావరణం ఎల్లో అలెర్ట్ ప్రకటించింది.