సీఎం రేవంత్ రూపంలో గణేశుడు

రైజింగ్ తెలంగాణ పేరిట ప్రతిష్టించిన ప్రత్యేక గణనాథుడు సోషల్ మీడియాలో వైరల్;

Update: 2025-08-27 13:09 GMT

రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. సందర్భంగా హైదరాబాద్ గోషామహల్‌లో ప్రత్యేక ఆకర్షణగా "రైజింగ్ తెలంగాణ" పేరిట వినూత్న గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించారు.

తెలంగాణ రైజింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మండపం స్థానికుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఈసారి గణనాథుడిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూపంలో తీర్చిదిద్దడం విశేషం.

రేవంత్ రెడ్డి వేషధారణలో గణపతి విగ్రహం నిలవడంతో భక్తులు, ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ ప్రత్యేక గణపతి విగ్రహం ఫోటోలు వైరల్ అవుతూ పెద్ద చర్చనీయాంశంగా మారాయి.

Tags:    

Similar News