రెండు దశాబ్దాల తర్వాత ఓయూకు సీఎం

రెండు కొత్త హాస్టళ్ల ప్రారంభం – 1,200 మంది విద్యార్థులకు వసతి - మరో రెండు హాస్టళ్లకు శంకుస్థాపన – 300 మందికి అదనపు సదుపాయం;

Update: 2025-08-18 09:11 GMT

ఇరవై సంవత్సరాల తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి రానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 21న యూనివర్సిటీ కి వచ్చి పలు కొత్త కార్యక్రమాలు ప్రారంభించనున్నారు.ఈ సందర్భంగా రెండు కొత్త హాస్టళ్లను సీఎం ప్రారంభించనున్నారు. సుమారు 80 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ హాస్టళ్లు 1,200 మంది విద్యార్థులకు వసతి కల్పించనున్నాయి. అదనంగా మరో రెండు హాస్టళ్లకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. వీటి నిర్మాణం పూర్తయ్యాక మరో 300 మంది విద్యార్థులకు వసతి లభిస్తుంది.

అలాగే 10 కోట్ల రూపాయలతో నిర్మించిన డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్‌ను కూడా సీఎం ప్రారంభించనున్నారు. ఇది విద్యార్థుల చదువుకు, పరిశోధనలకు ఎంతో ఉపయోగపడనుంది.విద్యార్థుల కోసం కొత్త పథకాలను కూడా సీఎం ఆవిష్కరించనున్నారు. విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే పథకంతో పాటు, పరిశోధన చేసే వారికి CM Research Fellowshipను ప్రారంభించనున్నారు.

టాగోర్ ఆడిటోరియంలో “విద్యా రంగంలో ప్రభుత్వ చర్యలు” అనే అంశంపై సీఎం ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు వెయ్యి మంది విద్యార్థులు, అధ్యాపకులు హాజరుకానున్నారు.ఈ సందర్శనతో OU–సర్కారు సంబంధాలు మరింత బలపడతాయని, కొత్త సదుపాయాలు విశ్వవిద్యాలయ అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News