ఒడిశాలో బంగారు ఖనిజాలు

ఒడిశాలోని నాలుగు జిల్లాల్లో బంగారు ఖనిజాలు గుర్తింపు - GSI శాస్త్రీయ పరీక్షలు కొనసాగుతున్నాయి – తవ్వకాలపై త్వరలో నిర్ణయం;

Update: 2025-08-18 09:45 GMT

భారత భూగవేశన సంస్థ (GSI) తాజాగా ఒడిశా రాష్ట్రంలో పెద్ద ఎత్తున బంగారు ఖనిజాలు ఉన్నట్లు గుర్తించింది. ప్రాథమిక అంచనాల ప్రకారం 10 నుంచి 20 మెట్రిక్ టన్నుల వరకు బంగారం లభించే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఈ బంగారు నిల్వలు ఒడిశాలోని నాలుగు జిల్లాల్లో బయటపడ్డాయి. అవి దేవగఢ్ (Deogarh), కేయోంజార్ (Keonjhar), సుందర్గఢ్ (Sundargarh), నబరంగపూర్ (Nabarangpur). వీటిలో దేవగఢ్ జిల్లాలో మొదటి గోల్డ్ మైనింగ్ బ్లాక్‌ను వేలానికి సిద్ధం చేస్తున్నారు.GSI నిపుణులు ఈ ప్రాంతాల్లో ఇంకా మరింత విపులమైన పరీక్షలు చేస్తున్నారు. ల్యాబ్‌లో రాళ్ల నమూనాలు పరీక్షించి, బంగారం ఎంత మేరకు తవ్వకం చేయగలమో అంచనా వేస్తున్నారు. ఈ పరీక్షలు పూర్తయిన తరువాతే బంగారం తవ్వకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబడుతుంది.

ప్రస్తుతం భారత్ తన అవసరాల కోసం పెద్ద ఎత్తున బంగారం దిగుమతి చేసుకుంటుంది. ఒడిశాలో ఈ స్థాయి గోల్డ్ మిగులు దొరకడం వల్ల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహం అందే అవకాశం ఉంది.ఇప్పటికే ఐరన్, బాక్సైట్, క్రోమైట్ ఖనిజాలతో ప్రసిద్ధి పొందిన ఒడిశా, ఇప్పుడు బంగారు నిల్వలతో కూడా కొత్త స్థాయికి చేరవచ్చు. ఇది రాష్ట్రానికి, దేశానికి పెద్ద స్థాయిలో ఉద్యోగాలు, పెట్టుబడులు, ఆర్థికాభివృద్ధి తీసుకురాగలదని నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News