ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ టూరిజం గమ్యస్థలంగా తీర్చిదిద్దుతాం ఏపీ సీఎం చంద్రబాబు
పర్యాటక రంగంలో 10,329 కోట్ల పెట్టుబడులు – 82 ఒప్పందాలపై సంతకాలు,వెల్నెస్ టూరిజానికి బాబా రామ్‌దేవ్ కీలక పాత్ర;
ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం మురళీ ఫార్చూన్ హోటల్లో జరిగిన గ్లోబల్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ (జీఎఫ్ఎస్టీ) టూరిజం కాన్క్లేవ్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం, పర్యాటక రంగం ద్వారా ఉద్యోగాలు, సంపద, సంక్షేమం సాధ్యమవుతాయన్నారు.
పర్యాటక రంగాన్ని "గేమ్ ఛేంజర్"గా అభివర్ణించిన సీఎం, రాష్ట్రంలో అనేక విభిన్న సర్క్యూట్లు – టెంపుల్, బీచ్, ఎకో, బుద్ధిజం – కల్పించినట్లు తెలిపారు. వేంకటేశ్వరస్వామి ఆలయం, శ్రీశైలం, కోనసీమ, హార్సిలీ హిల్స్ వంటి గమ్యస్థలాలు రాష్ట్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తున్నాయన్నారు. పర్యాటకానికి విద్యుత్ సబ్సీడీలు, అనుమతుల విషయంలో వేగవంతమైన ప్రాసెస్ అమలు చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు.
అనుమతుల కోసం ఎవ్వరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని,అన్ని అనుమతులు వాస్తవిక సమయాన్నే, వేగంగా లభించేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నాం అని సీఎం అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3 వేల హోటల్ గదులున్నాయని, వాటిని నాలుగేళ్లలో 15 వేలకు పెంచే లక్ష్యమున్నదన్నారు బాబు.
ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ను ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసడర్‌గా, వెల్నెస్ సలహాదారుగా సీఎం ఆహ్వానించారు. హార్సిలీ హిల్స్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో వెల్నెస్ సెంటర్‌ను పతంజలి ఏర్పాటు చేస్తుందని బాబా రామ్‌దేవ్ ప్రకటించారు. దిండి వంటి ప్రాంతాల్లో వెడ్డింగ్ క్రూయిజ్ బోట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించే ఆలోచన ఉందన్నారు బాబా రాందేవ్.
కాన్క్లేవ్లో భాగంగా రూ.10,329 కోట్ల విలువైన 82 ప్రాజెక్టులపై ఒప్పందాలు కుదిరాయి. సీఎం సమక్షంలో టూరిజం బ్రోచర్, కాఫీ టేబుల్ బుక్, ఈవెంట్ కేలండర్ విడుదలయ్యాయి. క్యారవాన్ హోటల్ గదులను సీఎం ప్రారంభించారు.
మూడుదశాబ్దాల క్రితం ఐటీని ప్రోత్సహించినదానిలాగే ఇప్పుడు పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. ఒక కుటుంబానికి ఒక వ్యాపారవేత్త" అనే నినాదంతో పర్యాటక రంగంలో ఎంటర్ప్రెన్యూర్లు తయారు చేస్తామని తెలిపారు.
చంద్రబాబు విసన్ విసనరీ, ప్రజల కోసం అనుభవంతో పాలిస్తున్న నేత అని,అతనిని దేవుడు తెలుగు ప్రజలకు వరంగా పంపాడు" అంటూ బాబా రామ్‌దేవ్ ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు.