జమ్మూ కశ్మీర్‌లో 12 మంది భక్తుల మృతి
నది ఉద్ధృతం కావడంతో కొట్టుకుపోయి భక్తులు - ఆర్మీ, NDRF, SDRF బృందాలు పరిస్తితిని నియంత్రించేందుకు చేరుకున్నాయి;
By : Dasari Suresh
Update: 2025-08-14 10:06 GMT
జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో జరిగిన విషాద ఘటనలో 12 మంది భక్తులు మరణించారు. మచైల్ మాతా గుడికి వెళ్ళేందుకు నదిని దాటుతున్న సమయంలో భారీ వర్షాల కారణంగా వరద ఉద్ధృతమై ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, ఆర్మీ, NDRF, SDRF బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.ఈ ఘటనపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి స్పందించారు. వారు బాధిత కుటుంబాలకు సానుభూతి తెలపగా, సహాయక చర్యలు వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.