ఓటీటీలోకి షకీలా బయోపిక్ !
రోజు ఉదయం ఒక కప్పు కాఫీతో మొదలుపెట్టడం సాధారణమైన విషయం. కానీ కొంతమందికి అందులో కొంచెం వివాదం కూడా కలిస్తే మరింత ఆసక్తికరంగా ఉంటుంది. అదే తరహాలో.. ఫేమస్ అడల్ట్ ఫిల్మ్ స్టార్ షకీలా జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్.. షకీల. సినిమా ప్రియులు తప్పక చూడదగిన చిత్రంగా నిలుస్తుంది. ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. ఒక చిన్న ఊరిలో పుట్టిన అమ్మాయి ఎలా స్టార్‌గా మారిందో ఆసక్తికరంగా చూపిస్తుంది.
అడల్ట్ సినిమాలను ఆస్వాదించేవారిపై కానీ, బహిరంగంగా దూషించేవారిపై కానీ ఈ చిత్రం వ్యంగ్యంగా స్పందిస్తుంది. షకీల పాత్రలో రిచా చద్దా అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఆమెను కేవలం నటిగా కాకుండా, ఆర్థిక అవసరాల వల్ల ఈ రంగంలోకి వచ్చిన వ్యక్తిగా చిత్రీకరించడం ద్వారా, షకీలాను ఒక సాధారణ మనిషిగా చూపించారు. రిచా చద్దా సహజ నటన వల్ల... ప్రేక్షకులకు ఆమె కథను మరింత చేరువ చేస్తుంది.
2020, డిసెంబర్ 25న షకీల చిత్రం థియేటర్స్ లో విడుదలైంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను తీసుకొచ్చారు. అయితే ఇన్నాళ్ళకు ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లోకి తీసుకొచ్చారు మేకర్స్, అయితే ఇందులో హిందీ వెర్షన్ మాత్రమే ఉండడం గమనార్హం. తెలుగు వెర్షన్ కోసం ఆడియన్స్ పోస్టులు పెడుతున్నారు. త్వరలోనే ఈ సినిమా తెలుగు వెర్షన్ ఓటీటీకి వచ్చే అవకాశాలున్నాయి.