ఓటీటీ లోకి 'కుబేర'!
నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం 'కుబేర'. జూన్ 20న థియేటర్లలో విడుదలై ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది.;
By : S D R
Update: 2025-07-11 12:30 GMT
నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం 'కుబేర'. జూన్ 20న థియేటర్లలో విడుదలై ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. లేటెస్ట్ గా 'కుబేర' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.
ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 18 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంటుంది. ఈ సినిమాలో నాగార్జున డిఫరెంట్ షేడ్స్ ఉన్న దీపక్ పాత్రలో మెప్పించగా, ధనుష్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శేఖర్ కమ్ముల టేకింగ్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి.